తెలంగాణలో ఫ్యామిలీ సర్టిఫికెట్‌కు గ్రీన్ సిగ్నల్.. ఎలా దరఖాస్తు చేయాలి? పూర్తి వివరాలు

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ ప్రక్రియను ప్రారంభించింది. కుటుంబ సభ్యుల పూర్తి వివరాలతో కూడిన ఈ సర్టిఫికెట్ ప్రభుత్వ పథకాలు, అధికారిక ధ్రువీకరణ, ఇతర సేవలకు ఉపయోగపడనుంది.

1 ఆగస్టు, 2026 2:55 PMByNarender Kumar Nangunoori

Share this article

తెలంగాణలో ఫ్యామిలీ సర్టిఫికెట్‌కు గ్రీన్ సిగ్నల్.. ఎలా దరఖాస్తు చేయాలి? పూర్తి వివరాలు

https://g.indiacustomercare.com - Image

హైదరాబాద్, ఆగస్టు 1: రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా, పారదర్శకంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన... కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను ఒకే ధ్రువీకరణ పత్రంలో అందించే విధంగా ఈ కొత్త వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చామని తెలిపారు.

ఫ్యామిలీ సర్టిఫికెట్‌లో ఉండే వివరాలు

ఈ సర్టిఫికెట్‌లో కుటుంబానికి సంబంధించిన అన్ని కీలక వివరాలు నమోదు చేయబడతాయి. అందులో...కుటుంబ యజమాని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, కుటుంబ యజమానితో ఉన్న సంబంధం, వయస్సు, పుట్టిన తేదీ, లింగం, ఆధార్ నంబర్, ప్రస్తుత నివాస చిరునామా వంటి వివరాలు అధికారిక రికార్డుల ఆధారంగా నమోదు చేయబడతాయి.

రేషన్ కార్డుతో అనుసంధానం

ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను ఫుడ్ సెక్యూరిటీ (రేషన్) కార్డు డేటాబేస్‌తో అనుసంధానం చేశారు. ప్రతి కుటుంబానికి ప్రత్యేక ఫ్యామిలీ రిజిస్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్ (FRIN) కేటాయించనున్నారు. సాధారణంగా రేషన్ కార్డు నంబరునే ఈ గుర్తింపు సంఖ్యగా ఉపయోగించనున్నారు. దీంతో కుటుంబ వివరాల ధ్రువీకరణ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.

ఎలా దరఖాస్తు చేయాలి

ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు సమీపంలోని మీ సేవా కేంద్రం, మీ సేవ ఆన్‌లైన్ పోర్టల్, మీ సేవ మొబైల్ యాప్ ద్వారా నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు

ఒక కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన ఏ సభ్యుడైనా ఈ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తు అందిన తర్వాత సంబంధిత మండల తహసీల్దార్ కార్యాలయం పరిశీలించి సర్టిఫికెట్ జారీ చేస్తుంది.

ఎందుకు ఉపయోగపడుతుంది

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ ప్రభుత్వ సేవలు, కుటుంబ ధ్రువీకరణ అవసరాలు, ఇతర అధికారిక ప్రక్రియల్లో ఈ ఫ్యామిలీ సర్టిఫికెట్ అధికారిక ధ్రువీకరణ పత్రంగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వ సేవలను మరింత వేగంగా, సులభంగా ప్రజలకు అందించడంలో ఈ కొత్త విధానం కీలకంగా మారనుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

Ganesh Chaturthi

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు